Site icon vidhaatha

KTR: కేటీఆర్​ను.. ఈరోజు అరెస్ట్​ చేయనున్నారా..?

KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో (Formula E Car Racing Case) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR)ను ఏసీబీ (Anti Corruption Bureau) అధికారులు దాదాపు ఆరున్నర గంటలపాటు విచారించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పెద్ద మొత్తంలో నిధుల బదలాయింపు, అనధికారిక ఆర్థిక లావాదేవీలు జరగాయని, నియమాలను ఉల్లంఘించి రూ.55 కోట్లు(55 Crores) ఎఫ్‌ఈవో(FEO)కు బదిలీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదంలో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా రావాలని ఏసీబీ ఆదేశించగా, కేటీఆర్ ఎప్పుడు పిలిచినా వస్తానని తెలిపారు. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి 40 రకాలుగాఅడిగారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను చెప్పాల్సినది చెప్పినట్లు తెలిపారు కేటీఆర్.

రాజకీయ ప్రేరేపిత(Politically motivated) కుట్రగా అభివర్ణిస్తున్న ఈ కేసులో ఈరోజు (శుక్ర‌వారం) కూడా ఏసీబీ విచారణకు పిలిపించి, సాయంత్రం అరెస్ట్​ చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కాబట్టి, కనీసం రెండు రోజులు జైల్లోనే ఉండేలా ప్లాన్​ చేస్తారని రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు బిఆర్​ఎస్​ వర్గాలు కూడా ఆందోళనలో ఉన్నారు.

ఎప్పుడేం జరగుతుందో తెలియకుండా ఉందని పార్టీ సీనియర్​ నాయకుడొకరు వాపోయారు. కావాలనే రేవంత్​రెడ్డి(Revanth Reddy) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, రేవంత్​ అడగమన్న ప్రశ్నలనే ఏసీబీ అడిగిందని కేటీఆర్​ పేర్కొనడం విశేషం. ఈ కేసులో ఏ2గా ఉన్న అప్పటి మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​కుమార్(Arvind Kumar)​, పూర్తిగా కేటీఆర్​ ఆదేశాలతోనే నిధుల బదలాయింపు జరిగినట్లు ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చాడు. హెచ్​ఎండిఏ మాజీ అధినేత దానకిశోర్​(Dana Kishore) ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు.

ఇంకోపక్క ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(Enforcement Directorate) కూడా ఈ కేసులోకి ఎంటరైంది. వాళ్లు ఇప్పటికే అరవింద్​ కుమార్​ స్టేట్​మెంట్​ను రికార్డ్​ చేసారు. కేటీఆర్​ను కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈడీ కూడా ఏ క్షణంలోనైనా విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ కేసు రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేపుతోంది. పారిశ్రామిక వర్గాల్లో కేటీఆర్​కు మంచి సంబంధాలుండటంతో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Exit mobile version