Site icon vidhaatha

KTR | గురుకులాల సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం సంతోషకరం : కేటీఆర్

విద్యార్థులకు మెరుగైన విద్యా, భోజనం, వసతులు కల్పించాలని విజ్ఞప్తి

విధాత, హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో సమస్యలపై ప్రభుత్వం మొత్తానికి స్పందించటం పట్ల బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. గత 8 నెలల కాలంలో విషాహారం కారణంగా దాదాపు 500 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారన్నారు. నిన్న కూడా సంగారెడ్డి జిల్లా లోని బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థుల భోజనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ నిన్న ప్రభుత్వాన్ని కోరారు. ఐతే తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ పాఠశాలలను సందర్శించనున్నారని, ఐతే మంత్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కేటీఆర్ కోరారు. మొన్నటి వరకు కూడా అంతా బాగానే ఉందన్నట్లు మొద్దు నిద్రలో ఉన్న సర్కార్ ను మేల్కొనేలా చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన వెయ్యి గురుకులాల్లో విద్యా, భోజనం, వసతులు బాగుండేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ మంత్రులను కోరారు.

Exit mobile version