Site icon vidhaatha

మంత్రి సహా కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీస్‌లు

Manthri

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినిమా వాళ్ల ఫోన్లను, కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలిపారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రస్తావించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రితో పాటు ఇద్దరు నేతలు లీగల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Exit mobile version