విధాత: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Adi Srinivas Mla) కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడలోని డబుల్ బెడ్రూం ఇండ్ల(Double Bedroom)ను అధికారులు, అనుచరులతో కలిసి పరిశీలిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బేస్మెంట్ (Basement Collapse)కుప్ప కూలిపోయింది. అదృష్టవశాత్తు వారంతా ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల నాణ్యతను ఈ సంఘటన ప్రశ్నార్థం చేసింది.
అప్పట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు సరిపడ డబ్బులు ఇవ్వకపోవడంతో అనేక మంది కాంట్రాక్టర్లు పనుల మధ్యలోనే తప్పుకున్నారు. మెజార్టీ ప్రాంతాల్లో టెండర్లు కూడా వేయడలేదు. నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం నష్టాలను తగ్గించుకునేందుకు నాసిరకం నిర్మాణాలు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ కూలిన డబుల్ బెడ్రూం బేస్మెంట్ ప్రమాదం డబుల్ బెడ్రూం ఇండ్ల నాణ్యతపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి తప్పిన ప్రమాదం
వేములవాడలో డబుల్ బెడ్రూం ఇండ్లు పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కూలిన బేస్మెంట్ pic.twitter.com/BQ4ugzjQoI
— Tharun Reddy (@Tarunkethireddy) November 25, 2025
