Site icon vidhaatha

తిరగబడరా స్వామి సినిమా ప్రెస్‌మీట్‌లో లావణ్య రచ్చ

విధాత, హైదరాబాద్ : హీరో రాజ్‌తరుణ్‌, హీరోయిన్ మౌల్వీలు నటించిన తిరగబడరా స్వామి సినీమా ప్రెస్‌మీట్ రచ్చరచ్చగా మారింది. ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్‌మీట్ జరుగుతుండగా రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య అక్కడి వచ్చి రాజ్‌తరుణ్ నాకు అన్యాయం చేశాడని, నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది. మీడియా సమావేశంలో లావణ్య నిరసనతో ఖంగుతిన్న రాజ్‌తరుణ్‌, మౌల్వీలు వెనుక గేటు నుంచి బయటకు వెళ్లిపోయారు. లావణ్య మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ ననున్ మోసం చేసి పారిపోయాడని, న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీతో తిరగాల్సిన అవసరం ఏముందని, మాల్వి తండ్రిని రాజ్ తరుణ్ మామ అని ఎందుకు అంటున్నాడని నిలదీసింది.

Exit mobile version