గత సంవత్సరం రాజ్‌తరుణ్ (Raj Tharun) పై ఆరోపణలతో చాలాకాలం వార్తల్లో ప్రధాన వ్యక్తిగా నిలిచింది లావణ్య (Lavanya). ఆపై ప్రేమ, పెళ్లి పేరుతో మస్తాన్ సాయి (Masthan Sai) అనే వ్యక్తి అమ్మాయిలను లోబర్చుకుంటున్నాడు అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్న ఓ హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. అంతేగాక తనపై కూడా అత్యాచారం చేశాడని, హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపే ప్రయత్నం చేసినట్లు లావణ్య వివరించింది.
అయితే ఇదే సమయంలో ఆ హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ (Nikhil), వరలక్ష్మి టిఫిన్ సెంటర్ (Varalakshmi Tiffin Center) ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు తెలిసింది. పైగా హీరో నిఖిల్ ఫోన్ ను మస్తాన్ హ్యాక్ చేసినట్లు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది.ట్రాప్ అయిన అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, మత్తులో ఉన్న సమయంలో వారిపై లైంగిక దాడి చేయడంతో పాటు వీడియోలు తీసి, బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలంటూ మస్తాన్ సాయి (Masthan Sai) పలుమార్లు వారిపై లైంగిక దాడి చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో లావణ్య వీడియోలు సైతం ఆమె బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి మస్తాన్ సాయి చిత్రీకరించినట్లు గుర్తించారు. లావణ్య మాట్లాడుతున్న వీడియో కాల్స్ తో పాటు, ప్రైవేట్ వీడియోలు 40 కి పైగా ఉన్నట్లు సమాచారం.