Site icon vidhaatha

Naini Rajender Reddy | అధికారం కోల్పోయినా మారని బీఆరెస్ నాయకులు : ఎమ్మెల్యే నాయిని

విధాత, వరంగల్ ప్రతినిధి:అధికారం నుంచి ప్రజలు పక్కన పెట్టినా బీఆరెస్ నాయకుల తీరు మారలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. హనుమకొండలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆరెస్ అంటే మాయ మాటలతో కడుపులు నింపడం వారికి వెన్నతో పెట్టిన విద్యని మండిపడ్డారు. రానున్న రోజుల్లో పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి చేస్తామని చెప్పారు.7,8 ఏళ్ల క్రితం రెండు పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, ఇన్ని రోజలుగా ప్రజలకు ఇవ్వని మీరు ఈ రోజు ఎమ్మెల్యే ఆపుతున్నారని విమర్శలు చేయడం సిగ్గు చేటని అన్నారు. భద్రకాళి మాడ వీధులకు రూ. 30కోట్లు నిధులు టెండర్లు జరిగాయ, నియోజకవర్గ అభివృద్ధి కోసం 10కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు.

బీఆరెస్ తప్పుడు ప్రచారం

కెసిఆర్, కేటీఆర్ లతో తిరిగిన పాండురంగారావు అనే వ్యక్తి మీహయంలో కోర్టును ఆశ్రయించి ఆర్ట్స్ కాలేజ్ వెనకాల, భద్రకాలి బండ్ దగ్గర నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లను కూల్చివేయాలనీ కేసు వేస్తే ప్రస్తుతం జడ్జిమెంట్ వచ్చిన క్రమంలో నేను చేయించాను అని ప్రజల్లో విష ప్రచారం చేస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. రైతు రుణమాఫీ లో అన్ని అవకతవకలు అంటున్నా బీఆరెస్ నాయకునికి అసలు వ్యవసాయం గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. ముందు మీ హరీష్ రావుని ఎమ్మెల్యేగా రాజీనామా చేయమని చెప్పు అంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, రామ్ ప్రసాద్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ రజాలి, MP ఆనంద్, మాజీ కార్పొరేటర్ అబూబాకర్ బక్కర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు మీర్జా అజీజుల్లా బేగ్, డాక్టర్ రామకృష్ణ,బంక సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version