పాత దోస్తు కలిస్తే ఆల్ ది బెస్ట్ చెప్పా

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను నువ్వే గెలుస్తావంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో శుక్రవారం తన వ్యాఖ్యల పట్ల మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.

  • Publish Date - April 27, 2024 / 02:50 PM IST

దానికే సోషల్ మీడియాలో తిప్పుతున్నారు
ఈటల గెలుపు వ్యాఖ్యలపై మల్లారెడ్డి వివరణ

విధాత: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను నువ్వే గెలుస్తావంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో శుక్రవారం తన వ్యాఖ్యల పట్ల మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. బీఆరెస్ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తాను, ఈటల రాజేందర్ ఓ పెళ్లిలో కలిశామని, నా పాత దోస్తు కలిసిండని..గతంలో నాతో పాటు మంత్రిగా ఉండేనని మర్యాదపూర్వకంగా ఆల్‌ది బెస్ట్..గాడ్ బ్లెస్ అని చెప్పినా..నువ్వేె గెలుస్తవని చెప్పిన..తప్పేముందన్నారు.

దానికే సోషల్ మీడియాలో పెట్టి మల్లారెడ్డి అట్ల చెప్పిండని తెగ తిప్పుతున్నారని, నా పగోడు కలిసినా మర్యాదగా అట్లనే చెప్పడం నాకు అలవాటని, గతంలో బొడుప్పల్‌లో జంగ మల్లేశ్ యాదవ్ ఎదురుపడినప్పుడు కూడా గట్లనే చెప్పినానని, అదంతా కనీస మర్యాద వరకే అన్నారు. ఈటల రాజేందర్ మన పార్టీకి, కేసీఆర్‌కు మోసం చేసి పోయిండని, కేసీఆర్‌తోనే ఆయన పెద్ద అయ్యిండని, అంతకుముందు ఏమి లేకుండేనని, కోడుగుడ్లు అమ్ముకుంటుండేనని విమర్శించారు.

మల్కాజిగిరి ప్రజలు బీఆరెస్ ప్రభుత్వం, కేసీఆర్ చేసిన మంచి పనులను చూసి బీఆరెస్ అభ్యర్థిని గెలిపిస్తారన్నారు. కొద్దిగా మొన్న గ్రామీణ ప్రాంతంలో 1.7శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని, దీనికే కాంగ్రెసోళ్లు ఆగుతలేరని, భూమి మీద నడుస్తలేరన్నారు. సాగుతాగునీరు, ఐటీ, సంక్షేమ రంగంలో కేసీఆర్‌, కేటీఆర్ దేశానికే ఆదర్శన పాలన అందించారన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ శని లాగా తయారైందన్నారు.

Latest News