కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్‌ … ట్విటర్ పోస్టుపై చర్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను విమర్శిస్తూ బీఆరెస్ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పెట్టిన ట్విట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీస్ పంపించింది.

  • Publish Date - July 5, 2024 / 07:03 PM IST

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను విమర్శిస్తూ బీఆరెస్ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పెట్టిన ట్విట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీస్ పంపించింది. బీఆరెస్ ట్వీట్‌లో పరోక్షంగా మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ.. ‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ బీఆరెస్‌ పోస్టులు పెట్టింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆరెస్‌ అఫిషియల్ అకౌంట్‌కు బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు తగవంటూ హెచ్చరించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గానూ తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో సీతక్క డిమాండ్ చేశారు. సీతక్క లీగల్ నోటీస్‌పై మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Latest News