Medaram : రేపు మేడారంలో దర్శనాలు బంద్

మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాలను బుధవారం (రేపు) ఒక్కరోజు నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం ప్రకటించింది. గద్దెల విస్తరణ, ప్రతిష్ఠాపన పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Medaram

విధాత, వరంగల్ : మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనాలను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. మంగళవారం గద్దెల ఆవరణలో ఆయన మాట్లాడారు. గోవిందరాజు పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటు గద్దెల విస్తరణ పనులు సాగుతున్నట్లు చెప్పారు. దీంతో ఒక్కరోజు అమ్మవార్ల దర్శనాలు నిలిపివేస్తున్నామని, భక్తులు సహకరించాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి :

Telangana Tops Liquor Spending : సౌత్ లిక్కర్ కింగ్ తెలంగాణ !
Bangladesh : బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ధ ఉద్రిక్తత

Latest News