హరీశ్‌రావు డ్రామాలు మానుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి

బీఆరెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మరోసారి అగ్గిపెట్టె నాటకం లాగా రాజీనామా నాటకానికి తెరలేపారని, స్పీకర్ ఫార్మాట్‌లో లేని రాజీనామా లేఖతో అమర వీరుల స్థూపం వద్ధ రాజకీయం డ్రామా వేశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు

  • Publish Date - April 26, 2024 / 02:29 PM IST

బూటకపు రాజీనామాతో మరో నాటకం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మరోసారి అగ్గిపెట్టె నాటకం లాగా రాజీనామా నాటకానికి తెరలేపారని, స్పీకర్ ఫార్మాట్‌లో లేని రాజీనామా లేఖతో అమర వీరుల స్థూపం వద్ధ రాజకీయం డ్రామా వేశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్ ఎమ్మెల్యేగా ఉన్న హరీశ్‌రావు స్వేచ్చగా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారంటే రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ పాలన సాగుతుందని అర్ధమవుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్గుగా ఆగస్టు 15వ తేదీలోపు రైతుల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

అప్పుడైనా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించేందుకు హరీశ్‌రావు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీష్ రావు భయపడుతన్నారన్నారు. గతంలో తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులకున్నానని కోమటిరెడ్డి గుర్తు చేశారు.అయినా బీఆరెస్ పార్టీలో హరీష్ రావు ఓ గుమాస్తా అని, మాట్లాడాల్సింది ఆయన కాదని, కేసీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు వాఖ్యలకు విలువ లేదని.. మేము రుణమాఫీ చేస్తే బీఆరెస్‌ను రద్దు చేస్తారా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.

హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో స్థూపం అపవిత్రం అయిందన్నారు. కాంగ్రెస్ చేసేదే చెబుతుందని.. చెప్పిందే చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బీఆరెస్ పాలనలో దళితులకు మూడెకరాలు, దళిత సీఎం పేరుతో కేసీఆర్ మోసగించారన్నారు. ఉపాధి హామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కల్పించలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరానంటూ హరీశ్‌రావు గొప్పలు చెప్పుకునే ముందు చేతనైతే మెదక్‌లో బీఆరెస్‌కు కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు ఫామ్‌హౌజ్ వదిలి బయటకు రాని కేసీఆర్ ఇప్పుడు కర్రపట్టుకుని రోడ్ల వెంట బస్సు వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. సచివాలయానికి రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా కేసీఆర్ రాలేదన్నారు. మూడు నెలల్లో రేవంత్ రెడ్డి 60 సార్లు సచివాలయానికి వచ్చారని, జనం అపాయింట్ మెంటు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారని, అదే కేసీఆర్ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్ మెంట్ లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారెంటీలు, హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

Latest News