Minister Ponnam | అషాడ మాసం బోనాల ఉత్సవాలను విజయం చేయాలి: మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో ప్రారంభంకానున్న అషాడ మాసం బోనాల పండుగ ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు

  • Publish Date - June 26, 2024 / 03:23 PM IST

అధికారులకు మంత్రి పొన్నం మార్గదర్శకం
ఈ దఫా ఉత్సవాలకు 20కోట్ల కేటాయింపు

 

విధాత, హైదరాబాద్‌ :హైదరాబాద్ నగరంలో ప్రారంభంకానున్న అషాడ మాసం బోనాల పండుగ ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వివిధ శాఖల అధికారులు, స్థానికులతో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 7వ తేదీన గోల్కోండ ఎల్లమ్మ బోనాలతో ప్రారంభమయ్యే అషాడ మాసం బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారని పొన్నం తెలిపారు. జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయని, నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే అషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 9వ తేదీన నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో జరిగే ఎల్లమ్మ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత సంవత్సరం బోనాలకు రూ.15 కోట్లు ఇస్తే, ఈ సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని వాటర్‌బోర్డు అధికారులకు సూచించారు. వీవీఐపీ పాసుల సంఖ్యను తగ్గించాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హన్మంతరావు, డీసీపీ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ సరళ, కోట నీలిమ పాల్గొన్నారు.

 

జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయని, నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే అషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 9వ తేదీన నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో జరిగే ఎల్లమ్మ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

గత సంవత్సరం బోనాలకు రూ.15 కోట్లు ఇస్తే, ఈ సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని వాటర్‌బోర్డు అధికారులకు సూచించారు. వీవీఐపీ పాసుల సంఖ్యను తగ్గించాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హన్మంతరావు, డీసీపీ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ సరళ, కోట నీలిమ పాల్గొన్నారు.

 

Latest News