YouTube stars | బోనమెత్తిన యూట్యూబ్ స్టార్స్

YouTube stars ర్యాలీని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్ విధాత, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ ర్యాలీని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం నాడు కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ప్రారంభించారు. ఈ ర్యాలీ తెలంగాణ చౌక్ లో ప్రారంభమై కలెక్టరేట్, భగత్ నగర్ మీదుగా బైపాస్ రోడ్ లోని లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయం […]

  • Publish Date - July 16, 2023 / 10:03 AM IST

YouTube stars

  • ర్యాలీని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్

విధాత, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ ర్యాలీని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం నాడు కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ప్రారంభించారు. ఈ ర్యాలీ తెలంగాణ చౌక్ లో ప్రారంభమై కలెక్టరేట్, భగత్ నగర్ మీదుగా బైపాస్ రోడ్ లోని లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు సాగింది.

ఈ ర్యాలీలో డాన్సులు కేరింతలతో నటీమణులు బోనాలు ఎత్తుకొని ఆకర్షణగా నిలిచారు. ఎల్లమ్మ దేవాలయంలో పూజల అనంతరం అక్కడే ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు ,తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు అసంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు చొప్పరి సుధాకర్, ప్రధాన కార్యదర్శి సీతామాలక్ష్మి, కోశాధికారి నడిమెట్ల గణేష్ , ప్రభు తిప్పర్తి, గద్దె ఉదయ్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కలర్ సత్తన్న, కడార్ల శివ ,రాష్ట్ర కార్యదర్శి అక్కెపల్లి యాదగిరి గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్, భూనాథ చారి, గణవేని శ్రీనివాస్ యాదవ్ , అనిత రాజ్, జిల్లా నాయకులు రజాక్ , కిషన్ నునుగొండ, నిమ్మల శ్రీనివాస్, కనకా రెడ్డి ,అకేన భాస్కర్ , రాధాకృష్ణ , రజని , కీస్ పిట్ట సప్న, అంజలి, భవాని గంగాభవాని , మనీషా , సిరి, సునీత, సునీత రెడ్డి , రోజా విజయలక్ష్మి , సిరి చందన , తెలంగాణ లక్ష్మి , స్వామి, జ్యోత్స్నతో పాటు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్లు, దాదాపు 300 మంది కళాకారులు పాల్గొన్నారు.

Latest News