Revanth Reddy | లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy సత్కరించిన ఆలయ కమిటీ విధాత: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఆలయ కమిటీ స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతరం సత్కరించింది. ఆర్చక బృందం ఆశీర్వచనాలు పలికింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్, వరదల నుంచి తెలంగాణ బయట పడిందన్నారు. రాష్ట్రాన్ని […]

  • By: Somu    latest    Jul 16, 2023 10:03 AM IST
Revanth Reddy | లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy

  • సత్కరించిన ఆలయ కమిటీ

విధాత: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఆలయ కమిటీ స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతరం సత్కరించింది. ఆర్చక బృందం ఆశీర్వచనాలు పలికింది.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్, వరదల నుంచి తెలంగాణ బయట పడిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని, ఇందుకు అమ్మవారి ఆశీస్సులు కోరానన్నారు.