Site icon vidhaatha

Revanth Reddy | లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy

విధాత: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఆలయ కమిటీ స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతరం సత్కరించింది. ఆర్చక బృందం ఆశీర్వచనాలు పలికింది.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్, వరదల నుంచి తెలంగాణ బయట పడిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని, ఇందుకు అమ్మవారి ఆశీస్సులు కోరానన్నారు.

Exit mobile version