CM Revanth Reddy| ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతరలో సీఎం రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram