విధాత, హైదరాబాద్ : చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగుల పట్ల వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేసి, మర్యాదగా ప్రవర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రాంగణంలో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిసరాలను శుభ్రపరచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో పడకల సంఖ్య 450నుంచి 600వరకు పెంచుతామని.. వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను ఆదేశించారు. మంత్రి వెంట నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్ కుమార్‌లు ఉన్నారు.
Tummala Nageswara Rao | వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలి : మంత్రి తుమ్మల
