టీడీపీ దీక్షకు కవిత మద్దతు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బోధన్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వస్తున్న నిరసన దీక్షా శిబిరాన్ని కల్వకుంట్ల కవిత సందర్శించి సంఘీభావం తెలిపారు

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ బోధన్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వస్తున్న నిరసన దీక్షా శిబిరాన్ని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించి సంఘీభావం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే షకీలక్‌త కలిసి ఆమె మద్దతు తెలిపారు. చంద్రబాబును 73ఏళ్ల వయసులో అరెస్టు చేయడం సరికాదన్నారు. బాబు అరెస్టు వ్యవహారం ఏపీలో జరుగుతున్న రెండు పార్టీల రాజకీయ వ్యవహారమని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అరెస్టుపై తొలుత హైద్రాబాద్‌లో టీడీపీ కార్యకర్తలు, మద్ధతుదారుల నిరసనలను అనుమతించలేది లేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాజకీయ ప్రయోజనాల కోణంలో బాబు అరెస్టును నిరసిస్తూ బీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కోక్కరు తమ మద్దతు తెలుపుతూ వస్తున్నారు.