Site icon vidhaatha

ప్రాంతీయ పార్టీలకు బతుకులేదన్న మోదీ..ఆ పార్టీల దయాతో ప్రధాని అయ్యారు … మాజీ ఎంపీ వినోద్ కుమార్‌

విధాత, హైదరాబాద్ : ప్రాంతీయ పార్టీలకు బ్రతుకులేదన్న నరేంద్రమోదీ.ప్రాంతీయ పార్టీల దయతో ప్రధాని అయ్యారుని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్ లో కరీంనగర్ జిల్లా జడ్పీటీసి, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. పులిలా ఉన్న మోదీ పిల్లిలాగా అయ్యారని, రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన మూడు న్యాయ చట్టాలపై సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ అనే అంశాన్ని మళ్లీ ప్రజల్లో లేవనెత్తాల్సిన అవసరముందని సూచించారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన అంశాలపై మళ్లీ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తామని అనడం సరికాదన్నారు. గతంలో వేసిన కమిటీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సీఎంల చర్చలపై బీఆరెస్ ప్రజలను రెచ్చగొట్టేందుకు నక్కల్లాగా వ్యవహరిస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. మేము నక్కల్లాగా లేమని, తెలంగాణ సమస్యలపై పులుల్లా గర్జించదానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆరెస్‌ పవర్ లో లేకపోవచ్చు కానీ ప్రజల్లో పవర్ ఫుల్ పార్టీగా బ్రతికే ఉందన్నారు. ప్రతి బీఆరెస్ కార్యకర్తలు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని అధికార ప్రక్షాన్ని నిలదీయాలన్నారు.

తెలంగాణ లో బీఆరెస్‌ మళ్లీ బలమైన శక్తిగా ఎదుగుతుందని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోయినంత మాత్రాన ప్రజలు, అసలైన ఉద్యమకాలం నాటి కార్యకర్తలు బీఆరెస్‌తోనే ఉన్నారని చెప్పారు. బీఆరెస్‌లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని, యువకులకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, ప్రజా క్షేత్రంలో ప్రతి ఒక్కరు ఉండాలని, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపై నిలదీయాలన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం మనదేనన్నారు. బీఆరెస్‌ కార్యకర్తలను అధికార కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు పెట్టిన తట్టుకుని ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్,కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీఆరెస్‌ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణ రావు, మాజీ జడ్పీ చైర్మన్ విజయ, మాజీ ఎమ్మెల్యే లు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఓడితల సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రవిందర్ సింగ్, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, కుర్మాచలం అనీల్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనీల్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపాల్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version