కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి ఎంపీ నిధులు …  భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

కొమురవెల్లి మల్లన్న దేవాలయం అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించేలా కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు.

  • Publish Date - June 30, 2024 / 05:01 PM IST

విధాత, హైదరాబాద్ : కొమురవెల్లి మల్లన్న దేవాలయం అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించేలా కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి..పట్నాలు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీనిచ్చారు. గతంలో తెలంగాణకు కేంద్రం నిధుల మంజూరులో అలసత్వం ప్రదర్శించిందని ఆరోపించారు. ఈ సారి తెలంగాణకు నిధులు మంజూరులో ఎంపీలు పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. గత బీఆరెస్‌ ప్రభుత్వంలో మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. హరీష్ రావు జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు వచ్చే నీటిని తపాస్ పల్లి రిజర్వాయర్ తో సిద్దిపేటకు తీసుకెళ్లి చేర్యాల రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రంగనాయక సాగర్ నుంచి నకిరేకల్, తుంగతుర్తి, బ్రహ్మాణ వెల్లెంల రిజర్వాయర్‌, ధర్మారెడ్డిపల్లి మూసీ కాలువలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వాటి పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ధ ప్రయత్నాలు చేస్తానన్నారు. స్మార్ట్ సిటీల పనులు అసంపూర్తిగా ఉన్నాయని, దీంతో సీఎం రేవంత్‌రెడ్డి పనుల పూర్తికి గడువు పొడగించి నిధుల సద్వినియోగంకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. అందుకు కేంద్రం స్పందించి ఆదేశాలిచ్చిందన్నారు. పొడగించిన గడువులోగా స్మార్ట్ సిటీ పనులు పూర్తయ్యేలా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు.

Latest News