MLC counting | మూడో రోజూ ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు.. కొనసాగుతున్న ఎలిమినేషన్‌ ప్రక్రియ

MLC counting | 'నల్లగొండ-ఖమ్మం-వరంగల్' గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. తొలి రెండు రోజులు జరిగిన తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఏ ఒక్క అభ్యర్థికీ గెలుపు కోటా ఓట్లు దక్కలేదు. దాంతో ఇవాళ ఎలిమినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తున్నారు.

  • Publish Date - June 7, 2024 / 08:51 AM IST

MLC counting : ‘నల్లగొండ-ఖమ్మం-వరంగల్’ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. తొలి రెండు రోజులు జరిగిన తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఏ ఒక్క అభ్యర్థికీ గెలుపు కోటా ఓట్లు దక్కలేదు. దాంతో ఇవాళ ఎలిమినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తున్నారు.

‘నల్లగొండ-ఖమ్మం-వరంగల్’ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 4.63 లక్షల ఓట్లు ఉండగా అందులో 3.36 లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలైన ఓట్లలో 25,824 ఓట్లు చెల్లుబాటు కాలేవు. 3,10,190 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. వాటిలో సగం అంటే 1,55,095 ఓట్లను గెలుపు కోటా ఓట్లుగా నిర్ణయించారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఎవరూ ఈ గెలుపు కోటా ఓట్లను దక్కించుకోలేకపోయారు.

దాంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. అందులో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి పడిన ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను ముందు వరుసలో ఉన్న అభ్యర్థులకు పంచుతూ వస్తున్నారు. విజయం కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 32,282 ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 50,847 రెండో ప్రాధాన్యత ఓట్లు కావాల్సి ఉంది.

Latest News