Narayana School Flexi Viral | తల్లిదండ్రులారా..నైటీలు, నిక్కర్లు వేసుకొని రావద్ధు: పాఠశాల ఫ్లెక్సీ వైరల్

సూర్యాపేట నారాయణ పాఠశాల గేటు వద్ద నైటీలు, నిక్కర్లతో రావొద్దని పెట్టిన ఫ్లెక్సీ వైరల్. ఫార్మల్ డ్రెస్‌లోనే రావాలని యాజమాన్యం కఠిన సూచనలు జారీ చేసింది.

Narayana School Flexi Viral

విధాత : తల్లిదండ్రులు నైటీలు, నిక్కర్లు వేసుకొని పాఠశాలకు రావద్దంటూ ఓ పాఠశాల యజమాన్యం పెట్టిన ఫ్లెక్సీ వైరల్ గా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాల యజమాన్యం పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే తల్లిదండ్రులు నైటీలో నిక్కర్లు వేసుకొని రావద్దని ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పాఠశాలకు తమ పిల్లలను తీసుకొచ్చే క్రమంలో తల్లిదండ్రులు నైటీలు, నిక్కర్లు వేసుకుని వస్తుండటం..పలుమార్లు అలా రావద్దంటూ చెప్పిన వినకపోవడంతో పాఠశాల యజమాన్యం వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.

పాఠశాల గేటుకు ప్రియమైన తల్లిదండ్రులారా.. నైటీలు, నిక్కర్లు వేసుకొని రావద్దు అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. నైటీలు, నిక్కర్లలో వచ్చే తల్లిదండ్రులను పాఠశాల లోపలికి అనుమతించబోమని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫార్మల్ డ్రెస్, చీరలు ధరించి పాఠశాల లోపలికి రావాలని పలుమార్లు కోరినా ఫలితం లేదని, దీంతో పాఠశాల గేటుకు ఫ్లెక్సీ బోర్డు పెట్టినట్టు నారాయణ పాఠశాల యాజమాన్యం పేర్కొంది.