24 న మడికొండలో కాంగ్రెస్ బహిరంగసభ

ఈ నెల 24 న మడికొండలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే వరంగల్ పార్లమెంట్ జన జాతర సభను విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు

  • Publish Date - April 21, 2024 / 08:51 PM IST

– హాజరుకానున్న సీఎం. రేవంత్
– బహిరంగ సభను విజయవంతం చేయాలి
 వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రతినిధి: ఈ నెల 24 న మడికొండలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే వరంగల్ పార్లమెంట్ జన జాతర సభను విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు ప్రతి డివిజన్ నుండి 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముఖ్యమంత్రి సభలో పాల్గొనేల చేయాలని అన్నారు. బీజేపీ లాంటి మతత్వ పార్టీ నుండి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని కులాలు, మతాలతో కూడుకున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో పాంచ్ న్యాయ్ తో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. బీజేపీ నాయకులు మాయ మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రాబోయే పార్లమెంటు ఎన్నికలలో వరంగల్ ఎంపిగా డాక్టర్ కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన నెహ్రు కుటుంబానికి అండగా నిలుద్దామని తెలుపునిచ్చారు.
దేశంలో అయిన రాష్ట్రంలో అయిన అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. అందుకు కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దె దింపి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలనీ కోరారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసుకోవాలని అన్నారు.

– భారీగా శ్రేణులు తరలిరావాలి

ముఖ్యంగా ఈ నెల 24 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే వరంగల్ పార్లమెంట్ జన జాతర సభలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , అభిమానులు పెద్ద ఎత్తులో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు కూచన రవళి, సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పోరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, ఎస్, సి డిపార్టుమెంటు నేషనల్ కో-ఆర్డి నేటర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, నల్ల సత్యనారాయణ, బొంత సారంగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Latest News