Site icon vidhaatha

Suryapet | సకాలంలో అందని వేతనం.. ఆత్మహత్య చేసుకున్న చిరుద్యోగి

Suryapet | సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి (outsourcing employee)  వసీమ్‌ (Wasim) ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు (Salaries) చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌ నోట్‌లో వసీమ్‌ పేర్కొన్నారు. వసీమ్‌ తన భార్య రజనికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ‘డియర్‌ రజని.. ముందు నువ్వు నన్ను క్షమించు. నిన్ను చాలా బాధపెట్టాను. పిల్లలు జాగ్రత్త. మనకు ఎవ్వరు లేరు. కానీ, మన పిల్లలు అలా కాకూడదు. నేను చాలా ఊహలు కన్నాను. కానీ ఏదీ కుదరలేదు.

వచ్చే జన్మ అని ఉంటే నా పిల్లల్లో ఎవరికైనా కొడుకుగా పుడతా. ఇంకొక్కటి రజనీ నీకు వీలైతే అప్పుల వాళ్లకు డబ్బులివ్వు. ఎక్కువేం చేయలే..’. అంటూ తాను ఎవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నాని ఆ లేఖలో వెల్లడించారు. ఈ ఘటనపై బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రతి నెల ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలిస్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నదని, అది పచ్చి అబద్ధమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యానికి వసీమ్ ఆత్మహత్యనే ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వసీమ్‌ బలవన్మరణానికి కారణమెవరని ప్రశ్నించారు.

Exit mobile version