Local Body Elections | తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో గ్రామ పంచాయతీ ఎన్నికల( Gram Panchayat Lections ) సందడి మొదలైంది. మూడు విడుతల్లోస్థానిక సంస్థల ఎన్నికల( Local Body Elections )ను నిర్వహించనున్నట్లు నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సర్పంచ్( Sarpanch ), వార్డు మెంబర్ల( Ward Members ) స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌ల గౌరవ వేతనాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఊపందుకుంది.
స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న గౌరవ వేతనాలు 2021వ సంవత్సరంలో పెంచిన మొత్తాలే కొనసాగుతున్నాయి. 2021 ఏడాదికి పూర్వం సర్పంచ్‌లకు రూ.5,000 మాత్రమే చెల్లించగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని రూ.1,500 పెంచి రూ.6,500 చేసింది. ఎంపీటీసీ సభ్యులకు కూడా రూ.6,500 చొప్పున గౌరవ భత్యం అందుతోంది.
జడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రస్తుతం రూ.13,000 అందుతోంది. అత్యున్నత స్థానిక పదవిలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌కు మాత్రం రూ.1 లక్ష వరకు గౌరవ వేతనం అందుతుంది. అయితే.. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లకు మాత్రం ఇప్పటికీ ఎలాంటి గౌరవ వేతనం లభించడం లేదు. దీనిపై ఈ వర్గాల నుంచి కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కాగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 పంచాయతీలు, లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
