Panchayat Elections | హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల( Panchayat Elections )ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అయితే తొలి దశ ఎన్నికలకు డిసెంబర్ 11న పోలింగ్( Polling ) జరగనుంది. తొలి దశకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగిసింది. తొలి దశలో ఎన్నికలు జరిగే 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులు ఉన్నాయి. సర్పంచ్( Sarpanch ) పదవుల కోసం 25,654 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వార్డు సభ్యుల కోసం 82,276 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక తొలి దశ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి సూర్యాపేట జిల్లా( Suryapeta District )లో రికార్డు స్థాయిలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. 159 గ్రామ పంచాయతీలకు గానూ 1,387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో స్థానంలో వికారాబాద్ జిల్లా( Vikarabad District ) నిలిచింది. ఈ జిల్లా పరిధిలో 262 పంచాయతీలు ఉండగా 1,383 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా( Mahabubabad District )లో 1,239 నామినేషన్లు దాఖలు కాగా, ఈ జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
వార్డు సభ్యుల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా( Rangareddy District ) టాప్‌లో నిలిచింది. 1530 వార్డులకు గానూ 4,540 మంది నామినేషన్లు సమర్పించారు. వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు గానూ 4379 మంది పోటీ పడుతున్నారు.
ఇక సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 3. పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
