Ponnam Prabhakar| బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కుతోనే తగ్గిన కాంగ్రెస్ మెజార్టీ: మంత్రి పొన్నం

తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిదర్శనంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గడానికి బీజేపీ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి పడటమే కారణమన్నారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్(BRS)-బీజేపీ(BJP) కుమ్మక్కు రాజకీయాలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిదర్శనంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్Ponnam Prabhakar పేర్కొన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గడానికి బీజేపీ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి పడటమే కారణమన్నారు. వాస్తవానికి మేం ఆశించిన మెజార్టీ కంటే కొంత తక్కువ ఓట్లు వచ్చినప్పటికి పార్టీ విజయం సాధించడం ద్వార ప్రజలు మా ప్రభుత్వానికి అండగా ఉన్నారని స్పష్టమైందన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే..ఆ పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కయిన విషయం అవగతమవుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపుకు బీఆర్ఎస్ సహకరించినందునా…జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి బీజేపీ సహకరించిందని పొన్నం ఆరోపించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందని బీఆర్ఎస్, బీజేపీలు దుష్ఫ్రచారం చేశాయని, పోలింగ్ ముగయ్యగానే కాంగ్రెస్ కార్యాలయంపైకి దాడికి వచ్చారని పొన్నం ఆరోపింంచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, అందులోనూ హైదరాబాద్ లో రిగ్గింగ్ వంటి పరిస్థితి ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు లభించిన ఆదరణతో కాంగ్రెస్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం దక్కిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజాపాలనకు రెఫరెండమే ఈ జూబ్లీహిల్స్ ఫలితాలు అని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వసనీయతని కోల్పోయిందని పొన్నం అన్నారు. బీఆర్ఎస్ కు పదేళ్లు పార్టీకి అవకాశం ఇచ్చినా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదన్న కారణంతో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారన్నారు.