విధాత, హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 1నుంచి 31వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని.. ప్రతి ఒక్కరు పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అన్ని జిల్లాలు , మండలాలు , గ్రామాల్లో రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని తెలిపారు. ప్రతి పాఠశాల రోడ్ భద్రతా క్లబ్ లో చేరాలన్నారు. రవాణా శాఖ సూచనలు పాటించాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు విధిగాహెల్మెట్ ధరించాలి.. మద్యం తాగి వాహనం నడపరాదు అని, రాంగ్ రూట్లో ప్రయాణం వద్దు , అతివేగంతో వాహనం నడపరాదు అని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్లే మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేశారు. రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు ,అధికారులు , విద్యార్థులు,ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
Mudumalai Elephant Video : ఆహా..తొలి మంచు తెరలలో గజరాజును చూడాల్సిందే!
Mudumalai Elephant Video : ఆహా..తొలి మంచు తెరలలో గజరాజును చూడాల్సిందే!
