Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావును సిట్ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన వారం రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.

Phone Tapping Case

విధాత, హైదారబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును రెండో రోజు సిట్ విచారణ చేస్తుంది. నిన్న శుక్రవారం రాత్రి వరకు ఆరున్నర గంటల పాటు సిట్ ప్రభాకర్ రావును విచారించింది. రాత్రి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిద్రించారు. శనివారం విచారణ కొనసాగిస్తున్నారు. ప్రభాకర్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతించింది. వారం పాటు ప్రభాకర్ రావుకు పోలీస్ స్టేషన్ లోనే ఉండేలా వసతికి ఏర్పాట్లు చేశారు.

తొలి రోజు విచారణలో ప్రభాకర్ రావు ను ఐదు ఐ క్లౌడ్, ఐదు జీమెయిల్ ఖాతాల్లోని డేటా రికవరీలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. నాలుగు ఖాతాల డేటాపై ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిగత సమాచారం మాత్రమే తాను డివైస్ నుంచి తొలగించానని ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పడం విశేషం. మరోవైపు సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీల నుంచి కూడా సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ డేటాపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం సేకరించిన పాస్‌వర్డ్‌ల ఆధారంగా ప్రభాకర్‌రావు వినియోగించిన డివైజ్‌లను విశ్లేషించే పనిలో సిట్‌ నిమగ్నమైంది. దీనిపై స్పష్టత వస్తే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించనుంది.

రెండోరోజు సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కోసం డేటా ఎలా సేకరించారు..? ఎవరు ఇచ్చారు..? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి పరికరాలు వాడి ట్యాపింగ్‌కు పాల్పడ్డారు..? ఇలాంటి కీలక అంశాలు అన్నింటిపై సిట్ అధికారులు అరా తీస్తున్నారు. హై క్లౌడ్ డేటా డిలీట్, హార్డ్ డిస్క్ ల ధ్వంసంపైన, డేటా ధ్వంసం వెనుక ఏ రాజకీయ నాయకుడు కుట్ర ఉందన్న దానిపై సిట్ ప్రశ్నలు సంధించనుంది.

ఇవి కూడా చదవండి :

AP FiberNet Case : ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట

Nidhhi Agerwal | అందాలతో ఆగం చేస్తున్న నిధి అగర్వాల్

Latest News