Rains | ఆకాశం మేఘావృతం.. ఇవాళ సాయంత్రం హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు..!

Rains | హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత‌మై ఉంది. మ‌బ్బులు క‌మ్ముకోవ‌డంతో ఉక్క‌పోత నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తోంది. సోమ‌వారం సాయంత్రం, రాత్రికి హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది,

  • Publish Date - June 10, 2024 / 10:13 AM IST

Rains | హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత‌మై ఉంది. మ‌బ్బులు క‌మ్ముకోవ‌డంతో ఉక్క‌పోత నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తోంది. సోమ‌వారం సాయంత్రం, రాత్రికి హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా మెరిసే అవ‌కాశం ఉంద‌న్నారు. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. గ‌త నాలుగైదు రోజుల నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక గ‌రిష్ఠంగా 29 డిగ్రీలు, క‌నిష్ఠంగా 24 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

Latest News