Site icon vidhaatha

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంట మూడు తరాల రక్షాబంధన్‌

విధాత : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు వెరీ వెరీ స్పెషల్‌ అన్నట్టు సాగాయి. అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే రాఖీ పండుగ వేడుకలు జగదీశ్‌ రెడ్డి నివాసంలో ముచ్చటగా మూడు తరాల అత్మీయానుబంధాల వేడుకగా నిలవడం విశేషం. గుంటకండ్ల కుటుంబంలోని మూడు తరాల సోదరీ సోదరులు ఒక్కచోట చేరి రాఖీలు కట్టుకుని తమ ప్రేమానుబంధాలను చాటుకున్నారు. జగదీశ్‌ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డికి ఆయన అక్కాచెల్లెళ్లు రాఖీ కడితే.. జగదీష్ రెడ్డికి తోబుట్టువు రాఖీ కట్టింది. అలాగే జగదీశ్‌ రెడ్డి కుమారుడు వేమన్‌కు ఆయన చెల్లెలు లహరి రాఖీ కట్టారు. ఇలా జగదీష్ రెడ్డి ఇంట్లో రాఖీ పండుగ మూడు తరాల అనుబంధాలకి వేదికగా నిలవడం వైరల్ గా మారింది.

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం పల్లెపహాడులో జరిగిన మూడు తరాల రాఖీ సంబరంలో తొంభై ఆరేళ్ళ కల్మెకొలను అండమ్మ తన తమ్ముడు గుంటకండ్ల రామచంద్ర రెడ్డి(93)కి రాఖీ కట్టారు. రామచంద్రారెడ్డికి మరో సోదరి కడారు వసంత (81) కూడా రాఖీ కట్టారు. రామచంద్రారెడ్డి తనయుడైన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డికి ఆయన సోదరి కట్టా రేణుక రాఖీ కట్టారు. జగదీశ్‌ రెడ్డి తనయుడు వేమన్‌కు సోదరి లహరి రాఖీ కట్టాడం విశేషం.

Exit mobile version