Site icon vidhaatha

Ration shops | బీ అల‌ర్ట్.. రేపు తెలంగాణ‌లో రేష‌న్ షాపులు బంద్..!

Ration Shop

Ration shops | హైద‌రాబాద్ : రేష‌న్ కార్డు( Ration Cards ) ల‌బ్ధిదారుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేష‌న్ షాపులు( Ration Shops ) మూత‌బ‌డ‌నున్నాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ) ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కపోవ‌డంతో.. శుక్ర‌వారం రేష‌న్ షాపులు బంద్ చేయాల‌ని రేష‌న్ డీల‌ర్లు( Ration Dealers ) నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేష‌న్ షాపులు రేపు మూత‌బ‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో రేష‌న్ ల‌బ్ధిదారులు బియ్యం తీసుకునేందుకు అవ‌కాశం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 21 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని రేష‌న్ డీల‌ర్లు పేర్కొన్నారు. గత ఐదు నెలల నుంచి ప్రభుత్వం కమిషన్‌ చెల్లించడం లేదని రేష‌న్ డీల‌ర్లు తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రేస్ పార్టీ ప్రతి రేషన్‌ డీలర్‌కు రూ. 5వేల గౌరవ వేతనం ఇస్తామని, కమిషన్‌ పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ ఊసేలేదన్నారు. కమిషన్‌ పెంచకపోవడమే కాకుండా ఇచ్చే కమిషన్‌ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇక నుంచి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కమిషన్‌ వేరు వేరుగా కాకుండా ఒకేసారి చెల్లించాలని వారు రేష‌న్ డీల‌ర్లు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version