Prajavani | ప్రజావాణికి పోటెత్తిన జనం.. సమస్యలపై వినతి పత్రాల వెల్లువ

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం శుక్రవారం తిరిగి పునః ప్రారంభమైంది.

  • Publish Date - June 7, 2024 / 01:11 PM IST

విధాత: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం శుక్రవారం తిరిగి పునః ప్రారంభమైంది. ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ జి. చిన్నారెడ్డి ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఎప్పటిలాగే ప్రతి శుక్ర, మంగళ వారాల్లో ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజావాణి నిర్వహణ కోసం ఎదురుచూస్తున్న ప్రజలు శుక్రవారం ప్రజాభవన్‌కు వేల సంఖ్యలో తరలివచ్చారు.

కాగా.. తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందించారు. భారీగా తరలివచ్చిన జనం ప్రజాభవన్ బయట రోడ్డు మీద కూడా క్యూలైన్లు కట్టారు. ఒపిగ్గా తమవంతు వరకు నిరీక్షించి తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రజావాణిలో వచ్చిన వినతి పత్రాల్లో పేర్కోన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజావాణి ఇంచార్జి జి.చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యలు అధికారులను ఆదేశించారు.

Latest News