Site icon vidhaatha

Renuka vs Suresh Reddy : ఉప రాష్ట్రపతి ఎన్నికపై రేణుకా చౌదరి..సురేష్ రెడ్డిల మాటల యుద్దం

Renuka Chowdhury and Suresh Reddy

విధాత: ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్(BRS) అనుసరించిన తీరుపై రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి(Renuka Chowdhury), చాడ సురేష్ రెడ్డిల(Chada Suresh Reddy) మధ్య మాటల యుద్దం సాగింది. ఉప రాష్ట్రపతి ఎన్నికను బీఆర్ఎస్ బహిష్కరిస్తుందని రాజ్యసభ బీఆర్ఎస్ పక్ష నాయకుడు చాడ సురేష్ రెడ్డి తమ పార్టీ వైఖరిని మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో రైతులకు ఎరువుల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాన్నారు. ఇద్దరు అభ్యర్థులు సమర్థవంతులు.. వారిపై గౌరవం ఉందంటూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగానే బీఆర్ఎస్(BRS) ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకుందని సురేష్ రెడ్డి వివరించారు.

అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి(Justice Sudarshan Reddy) బీఆర్ఎస్ మద్దుతునివ్వకపోవడం..అందులో తెలంగాణ(Telangana) రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వ్యక్తికి మద్దతునివ్వకపోవడం బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుచేటు అని రేణుకా మండిపడ్డారు. కేసుల భయంతోనే బీఆర్ఎస్ ఎన్డీఏకు పరోక్షంగా సహకరించేలా ఓటింగ్ కు దూరంగా ఉందని విమర్శించారు.

 

 

Exit mobile version