ధాన్యం టెండర్లలో వేయికోట్ల కుంభకోణం అవాస్తవం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం లిఫ్టింగ్‌..సన్న బియ్యం కొనుగోలుకు సంబంధించి 1000కోట్లకు పైగా కుంభకోణం జరిగిందంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

  • Publish Date - May 26, 2024 / 06:28 PM IST

కేటీఆర్‌, మహేశ్వర్‌రెడ్డి ఆరోణలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటర్‌
ధాన్యం కొనుగోలుపై బీఆరెస్‌, బీజేపీలు కలిసి మాపై దుష్ప్రచారం
లిఫ్టు చేసిన ధాన్యం 200కోట్లయితే 1000కోట్ల కుంభకోణం ఎలా సాధ్యం
సన్న బియ్యం కిలో 42కు ఇప్పిస్తే ఎంతైనా కొంటామని సవాల్‌

విధాత: ధాన్యం లిఫ్టింగ్‌..సన్న బియ్యం కొనుగోలుకు సంబంధించి 1000కోట్లకు పైగా కుంభకోణం జరిగిందంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం గాంధీభవన్‌లో మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆరెస్ హయాంలో 2023 జూన్ 7 పేరుకుపోయిన, పాడైన ధాన్యం విక్రయించాలని వేలం టెండర్ పిలిస్తే 1700రూపాయలు టెండర్ కోడ్ చేశారన్నారు. దీంతో ఆ ప్రక్రియ ఆగిపోగా, మళ్లీ సంవత్సరం దాటిపోయాక ఆ ధాన్యం మరింత నాసిరకంగా మారిందని, దానిని మా ప్రభుత్వం వచ్చాకా మేం టెండర్ పెడితే దొడ్డు ధాన్యానికి 2007రూపాయలు వచ్చిందని, సన్న ధాన్యంకు 2,407వచ్చిందన్నారు.

గత ఫ్రభుత్వంతో టెండర్‌తో పోల్చితే అదనంగా 1100కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత రేటు రాలేదన్నారు. మేం అదనంగా 20శాతం ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చామన్నారు. అసలు ధాన్యం లిఫ్టు అయ్యిందే 200కోట్ల విలువ వరకే అయితే 1000-1100కోట్ల కుంభ కోణం ఎలా జరుగుతుందో ఏలేటీ, కేటీఆర్‌లకే తెలియాలన్నారు. పూర్తి అబద్దాలతో బీఆరెస్‌, బీజేపీలు కలిసి మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. టెండర్‌లలో భాగంగా సన్న బియ్యం కొనుగోలు ద్వారా 300కోట్ల అవినీతి జరిగిందంటున్నారని, అసలు మేం సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని, సన్న ధాన్యం ఒక్క గింజ అమ్మలేదని, అలాంటప్పుడు అవినీతి ఎక్కడ జరిగిందో వారికే తెలియాలన్నారు. కొంతమంది బడా ఢిఫాల్ట్ మిల్లర్లు బీఆరెస్‌, బీజేపీ నేతల చుట్టు చేరి మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. గడువులోగా సీఎంఆర్‌ ఇవ్వని మిల్లర్లకు మేం మళ్లీ ధాన్యం ఇవ్వడం లేదన్నారు.

డీఫాల్ట్ మిల్లర్లపై మేం చర్యలు తీసుకుంటే మాపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. 90శాతం మంది రైస్ మిల్లర్లు బాగానే నడిపిస్తున్నారని, కొంతమంది బీఆరెస్ ప్రభుత్వంలో మాదిరిగా నాయకులకు పైసలిచ్చి వందల కోట్ల విలువైన ధాన్యం వారి వద్ద పెట్టుకుని దందాలు చేస్తే నా వద్ద కుదరదన్నారు. డీఫాల్ట్ మిల్లర్లపై కేసులు పెట్టామని, రికవరి యాక్ట్ పెట్టామన్నారు. నేను ఉత్తమ్‌కుమార్‌రెడ్డినని, నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటానన్నారు. నేను ఎవరి దగ్గర నయాపైస తీసుకోలేదని స్పష్టం చేశారు. కేటీఆర్ చెప్పిన కేంద్రీయ బండార్‌ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టిందే వారేనని, తొలగించింది కూడా వారేనన్నారు. 30సంవత్సరాల ప్రజాప్రతినిధిగా చెబుతున్నానని, మిల్లర్లపై ఖచ్చితమైన నిబంధనల మేరకు వ్యవహరిస్తున్న ప్రభుత్వం మాదేనని గర్వంగా చెబుతున్నానన్నారు. మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేసి ఢిల్లీకి పంపించాల్సిన పరిస్థితి మాకు లేదన్నారు. ఏలేటినే ఢిల్లీకి పైసలు పంపి ఫ్లోర్ లీడర్ తెచ్చుకుని ఉంటాడని అందుకే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ కౌంటర్ వేశారు. సీఎంను కలిసి బయట ధాన్యం కొనుఓలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చి, లోపలికి వెళ్లి వెళ్లి భూముల కొనుగలు గురించి మాట్లాడిన సంస్కృతి మాది కాదన్నారు.

సన్న బియ్యం కిలో 42కు ఇప్పిస్తే ఎంతైనా కొంటాం

సన్న బియ్యం 42రూపాయలకు కిలో బయట మార్కెట్ దొరుకుతున్నాయని, మిల్లర్లు ఆ ధరకే ఇస్తామన్న మేం 57రూపాయలకు కొనుగోలు టెండర్ అనుమతించామని కేటీఆర్‌, ఏలేటి చెప్పారని, నిజంగా టెండర్ కండీషన్‌కు లోబడి 42రూపాయలకు కిలో సన్న బియ్యం ఇప్పిస్తే ప్రభుత్వం ఎంతైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నదని ఉత్తమ్ సవాల్ చేశారు. అలాగే దొడ్డు ధాన్యం అసలు ధర 2,223రూపాయలంటున్నారని, ఆ ధరకు వస్తే మీకే ఇస్తామన్నారు. బీఆరెస్ ప్రభుత్వంలో ఆగమైన పౌరసరఫరాల శాఖను గాడిలో పెట్టేందుకు నేను ప్రయత్నిస్తుంటే ఢీ పాల్ట్ మిల్లర్లతో కలిసి నాపై లేనిపోని నిందలేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

సివిల్ సఫ్లయ్ శాఖ 59వేల కోట్ల అప్పుల పాలు చేశారని, 11వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు. 20వేల కోట్ల ధాన్యం మిల్లర్ల వద్ద గాలికి వదిలేశారన్నారు. అలాంటి లోపాలన్నింటిని సరిదిద్దుతు ముందుకెలుతున్నానని తెలిపారు. 1కోటి 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గతంలో బీఆరెస్ అబద్ధాలు చెప్పుకుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మేం బీఆరెస్ ప్రభుత్వం కంటే 15రోజుల ముందే ప్రారంభించామని, గతం కంటే ఎక్కువగా 7,200కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ముందెన్నడు లేని రీతిలో తడిసిన ధాన్యం కూడా మద్దతు ధర మేరకు కొనుగోలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాలు, తరుగు విషయంలోనూ మేం రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన గంటల్లోనే అకౌంట్లలో రైతులకు డబ్బులు వేస్తున్నామన్నారు. , 20వేల కోట్ల ధాన్యం గాలికి వదిలేశారన్నారు.

దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్న విపక్షాలు :

గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెలుతుంటే, దెబ్బతీసిన ఓక్కో ప్రభుత్వ శాఖలను గాడిన పెడుతుంటే సరైన సలహాలు ఇవ్వకపోగా అసత్య ఆరోపణలు దుష్ప్రచారం చేయడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మంత్రి డి.శ్రీధర్‌బాబు ఆరోపించారు. మేడిగడ్డపైన కూడా విపక్షాలను సలహాలివ్వమని కోరామని గుర్తు చేశారు. బీఆరెస్ ఆగం చేసిపోయిన సివిల్ సఫ్లయ్ శాఖను ఉత్తమ్ సరిదిద్దుతుంటే చూడలేక ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

మేం ఇచ్చిన ఐదు గ్యారంటీలనుల అమలు చేస్తున్నామన్నారు. 200యూనిట్ల విద్యుత్తు పథకం అమలు చేస్తున్నామని, కేసీఆర్ బస్సు యాత్ర చేసి సూర్యాపేటలో జనరేటర్ మీద సభ నిర్వహించి కరెంటు కోతలంటూ ప్రభుత్వంపై నిందలేశారన్నారు. భువనగిరి,వరంగల్ ఆసుపత్రుల్లో బీఆరెస్ హయాంలో గంటల కొద్ది కరెంటు పోయిన పట్టించుకోలేదని, మేం 30నిమిషాల్లో సమస్యను పరిష్కరించామన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులను ఎలుకలు కోరికిన సంఘటన మరువరాదన్నారు. కరెంటు156 మిలియన్ యూనిట్ల నుంచి 192కు పెరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి కల్పనలకు కృషి చేస్తున్నామన్నారు.

 

Latest News