విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడైన మాజీ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డి ని గురువారం సిట్ విచారించింది. రెండు గంటలపాటు జరిగిన విచారణలు అధికారులు పలు ప్రశ్నలు వేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు సుమారు రెండు గంటలపాటు విచారించి, ఆయన నుండి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని SIT ప్రశ్నలు వేసినట్లు సమాచారం. తన స్టేట్‌మెంట్‌లో రాధాకిషన్‌రావు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు తెలిసింది. రాధాకిషన్‌రావు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ సన్నిహితుల వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాలు పరిష్కరించేందుకు తాము పనిచేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్‌రెడ్డిని SIT మళ్లీ విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా కూడా హాట్‌టాపిక్‌గా మారిన తరుణంలో, SIT విచారణలో కొత్త పేర్లు, వివరాలు బయటకు రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
కాగా, 2023 నవంబర్ 15 నాటి నుంచి 30 వరకు సుమారు 4,013 ఫోన్ నంబర్లు ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ నిర్ధారించింది. తెలంగానలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వ్యవహారంపై ప్రధానంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులతో పాటు ఫోన్ ట్యాపింగ్ కు గురైన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టుల స్టేట్ మెంట్లను రికార్డు చేసిన సిట్ విచారణను మరింత వేగం చేసింది.
