Site icon vidhaatha

ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకంపై సుప్రీం కోర్టు స్టే

supreme-court-orders-disqualifying-kodandaram-aamir-ali-khan-mlc-telangana

Supreme Court | కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం సిఫారసు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం కేసీఆర్ సర్కార్ సిఫారసు చేసింది. అయితే ఈ ఇద్దరి పేర్లను అప్పట్లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తిరస్కరించారు. దీంతో ఈ అభ్యర్థులు తొలుత హైకోర్టు , ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత 2024 ఆగస్టు 14న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ దాసోజ్ శ్రవణ్ కుమార్, సత్యనారాయణ స్థానంలో కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కు పంపారు. ఈ పేర్లను అప్పట్లో గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో బుధవారం సుదీర్ఘవాదనలు జరిగాయి. ఈ వాదనలు జరిగిన తర్వాత కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకంపై స్టే విధించింది కోర్టు. వచ్చే నెల 17వ తేదీకి విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

Exit mobile version