Telangana | పవర్ కమిషన్ చైర్మన్‌పై కేసీఆర్ లేఖ హాస్యాస్పదం

విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల్లో కొనుగోలు విషయంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తీరును తప్పుబడుతూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు మండిపడ్డారు

  • Publish Date - June 16, 2024 / 05:02 PM IST

విచారణకు భయపడుతున్నారని ఎద్దేవా
బీజేపీ నేతలు లక్ష్మణ్‌, ఏలేటిలు
చైర్మన్‌ను అవమానించి అహంకార చాటుకున్నారన్న బండి

విధాత, హైదరాబాద్ : విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల్లో కొనుగోలు విషయంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తీరును తప్పుబడుతూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు మండిపడ్డారు. కేసీఆర్ హాస్యాస్పదంగా ఉందని లక్ష్మణ్ విమర్శించారు. విద్యుత్తు కొనుగోళ్ల విచారణ న్యాయ కమిషన్‌పైనే కేసీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. కమిషన్ చైర్మన్‌పై లేఖలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాల్లో నిజాలు బయటకు రావాలన్నారు. రేవంత్ సర్కారు విచారణ పేరుతో కాలయాపన చేయవద్దని సూచించారు.

కేసీఆర్ లేఖపై బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌పై కేసీఆర్ నిందాపూర్వకంగా రాసిన లేఖ అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అపాయింట్ చేసిన పవర్ కమిషన్‌పై కేసీఆర్ ఎదురు దాడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకుండా ఎందుకు సెలైంట్ ఉన్నారని ప్రశ్నించారు. బీరెస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కేసీఆర్ లేఖను తప్పుబట్టారు.

కేసీఆర్ తన లేఖ ద్వారా తెలంగాణ వాది జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించారని, బెదిరించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఈ లేఖతో కేసీఆర్ తన అహంకార పూరిత వైఖరిని చాటుకున్నారన్నారు. ప్రజలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించానా కేసీఆర్‌కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. కమిషన్ విచారణపై అభ్యంతరాలుంటే కేసీఆర్ ఎందుకు కోర్టుకు వెళ్లలేదని నిలదీశారు. కమిషన్ ఇప్పటివరకు ఈఆర్సీ నిర్ణయాలపై విచారణ చేయలేదని, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధాన పర నిర్ణయాలు, వాటితో ప్రభుత్వ ఖజనాకు జరిగిన నష్టంపై మాత్రమే విచారణ సాగిస్తుందన్నారు. కేసీఆర్ చేసిన తప్పులకు ఈఆర్సీని, నరసింహారెడ్డిని నిందలేయడం సిగ్గుచేటన్నారు.

Latest News