రూ.3000 కోట్ల ప్రాజెక్ట్ ను కమీషన్ల కోసం రూ.18,500 కోట్లకు పెంచారు

సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 లోనే రూ. 3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, బీఆర్ఎస్ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేండ్లు ఆలస్యం చేసిందని ట్విట్టర్ లో కాంగ్రెస్ ఆరోపించింది

  • Publish Date - June 27, 2024 / 04:22 PM IST

10 ఏళ్ల ఆలస్యానికి బీఆరెస్ కారణం
సీతారామ ప్రాజెక్ట్ కు గోదావరి జలకళ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ఫలితమే
ట్విట్టర్ లో కాంగ్రెస్

విధాత: సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 లోనే రూ. 3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, బీఆర్ఎస్ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేండ్లు ఆలస్యం చేసిందని ట్విట్టర్ లో కాంగ్రెస్ ఆరోపించింది. ప్రాజెక్టుకు అవసరం అయిన అనుమతుల్లో, భూ సేకరణలో, బాధితులకు పునరావాసం అందించడంలో నిర్లక్ష్యం చేసి, బీఆర్ఎస్ నేతలు మాత్రం అందినకాడికి దోచుకున్నారని ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

సీతారామ ప్రాజెక్ట్ కు గోదావరి జలకళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ఫలితమేనని కాంగ్రెస్ పార్టీ ట్విట్ చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక, జనవరి 7, 2024 నాడు ప్రాజెక్టు పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారని ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ తెలిపింది

Latest News