Flood Relief : వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.1.30కోట్ల పరిహారం

తెలంగాణలో వరద బాధితులకు రూ.1.30 కోట్లు సహాయం; మృతి చెందినవారికి రూ.5 లక్షలు, పశువుల నష్టం కోసం ప్రత్యేక పరిహారం.

Telangana Floods Funds

Flood Relief | విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లు పరిహారం విడుదల చేసింది. వరదల్లో మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. పశువులు అధికంగా చనిపోయిన కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనుంది. ఒక మేక లేదా ఒక గొర్రె చనిపోతే రూ.5 వేల నష్టపరిహారం మంజూరు చేయనుంది.

కామారెడ్డి, మెదక్, కుమరం భీమ్ సిఫాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ములుగు, మహబూబ్ నగర్, జగిత్యాల, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల వరద బాధితులకు ఈ ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.