Group-1 | హైదరాబాద్ : టీజీపీఎస్సీ( TGPSC ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రూప్-1( Group-1 ) నియామక ప్రక్రియపై హైకోర్టు( Highcourt )లో తుది తీర్పు వెలువరించింది. పరీక్షలు యధావిధిగా జరుగుతాయని వెల్లడించింది.
కీ, రీ నోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితాను మళ్లీ విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ పూర్తి చేసింది. అన్ని అభ్యంతరాలను పరిశీలించాకే తుది కీని విడుదల చేశామని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఉండడంతో ఈ కేసు విచారణకు హైకోర్టు ప్రాధాన్యత ఇచ్చింది.
తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్న దృష్ట్యా నేడు ఉన్నత న్యాయస్థానం తన తీర్పును విడుదల చేసింది. పరీక్షలను యథాతధంగా నిర్వహించేందుకు టిజిపిఎస్సీకి అనుమతిని మంజూరు చేస్తూ, వివిద వర్గాలు దాఖలు చేసిన అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.