హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మానవతారాయ్, చరణ్ కౌశిక్, బాలలక్ష్మి, కిరణ్ యాదవ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గ్రూప్-2 వాయిదాతో పాటు గ్రూప్ -2, 3 పోస్టుల సంఖ్య పెంపు అంశాన్ని నిరుద్యోగులు కాంగ్రెస్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగుల డిమాండ్లను కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తానికి నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎట్టకేలకు గ్రూప్-2 వాయిదా వేసే అవకాశం ఉందని, కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గ్రూప్ 2 పరీక్ష వాయిదా!!
బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, మానవతారాయ్, చరణ్ కౌశిక్, బాలలక్ష్మి, కిరణ్ యాదవ్.
నిరుద్యోగులతో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లనున్న నేతలు
గ్రూప్ -2 వాయిదా… pic.twitter.com/ogRwkJy1Oj
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2024
గ్రూప్ -2 వాయిదాతో పాటు గ్రూప్ -2, 3 పోస్టుల సంఖ్య పెంచాలని గత నెల రోజుల నుంచి నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ ముట్టడి చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ అభ్యర్థులు అనేక రకాలుగా నిరసనలు చేపట్టి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసిన సంగతి తెలిసిందే.