విధాత: సుప్రీంకోర్టులో నేడు మరోసారి తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు విచారణ జరగనుండగా. డిసెంబర్ 9కి వాయిదా వేస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రవు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కల్పించిన మద్యంతర రక్షణను ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభాకర్ రావు ఉపయోగించిన ఐ క్లౌడ్ సరియైన ఐడి, పాస్వర్డ్ ను దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని గత విచారణ సందర్భంగా ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా గతంలో ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్, కంప్యూటర్ల పాస్‌వర్డ్ చెప్పేందుకు ఆయన సహకరించడం లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరోసారి వాయిదా
సుప్రీంకోర్టులో నేడు మరోసారి తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు విచారణ జరగనుంది. జస్టిస్ నాగరత్న ధర్మాసనం నేతృత్వంలో విచారణ జరగనున్నది. ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కల్పించిన మద్యంతర రక్షణను ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది

Latest News
ఐఐటీ రామయ్యకు నూరేళ్లు....వెల్లువెత్తిన శత వసంతాల శుభాకాంక్షలు
సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడంతో వల్లకాడులా మారిన గ్రామాలు : ఈటల
కోకాపేట నడిబొడ్డున వికసించిన పుష్పం
ఢాకాలో భారత వ్యతిరేక నినాదాలు..కశ్మీర్ కోసం పోరాడాలని ఉగ్రవాది పిలుపు
నిజంగా రామ్ చరణ్ని అలా చూడగలమా..
గిఫ్ట్స్ స్వీకరిస్తే ట్యాక్స్ చెల్లించాలా? ఎవరికీ మినహాయింపులున్నాయి?
పాలకులు మారినా...పట్టాలు రావాయే : జనం బాటలో కవిత
కుప్పంలో కృష్ణమ్మకు నారా భువనేశ్వరి జలహారతి
ఎమ్మెల్యేలు దానం, కడియంలకు స్పీకర్ నోటీసులు
ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ ను సీఎం ఏం చేస్తారో చెప్పాలి: బండి సంజయ్