TET Notification | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే?

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈనెల 15 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే సంవత్సరం జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

విధాత, హైదరాబాద్ :

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈనెల 15 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే సంవత్సరం జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, 2025 ఏడాదికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ జూన్ జారీ కాగా, పరీక్షలు పూర్తవడంతో పాటు జూలై 22న ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. అభ్యర్థులు తమతమ ఉద్యోగాల్లో చేరారు. తాజాగా ఇవాళ(గురువారం) రెండో విడత టెట్ నోటిఫికేసన్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు టెట్ లో తప్పక అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో వారు తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.