విధాత, హైదరాబాద్ : తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ప్రత్యేక బస్సులతో ప్యాకేజీని ప్రకటించినట్లు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఆయన పోస్ట్ చేశారు. ఈనెల 21న గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 19 నుంచి 22వ తేదీల వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త! గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, కరీంనగర్, ఖమ్మం, మహబుబ్నగర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను… pic.twitter.com/2s65B24x8v
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) July 14, 2024
హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ తదితర పట్టణాల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtconline. inను సందర్శించాలని సజ్జనార్ సూచించారు. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.