TGSRTC Recruitment 2025 Notification : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ ఆర్టీసీలో 198 సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే!

TGSRTC recruitment 2025 notification

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 84 ట్రాఫిక్‌ సూపర్‌వైజర్స్‌ ట్రైనీలు, 114 మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు అప్లికేషన్స్‌ స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం www.tgprb.in వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపింది.

సెప్టెంబర్ లో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) 1,743 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ నిర్వహించింది.

ఈ నోటిఫికేషన్ లో మిగిలిన 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌), 114 డిప్యూటీ సూపరింటిండెంట్‌ (మెకానికల్‌), 25 డిపోమేనేజర్‌/ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌), 18 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌), 11 సెక్షన్‌ ఆఫీసర్‌, 6 అకౌంట్స్‌ ఆఫీసర్‌, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్టు) పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. తాజాగా వాటిలో ప్రభుత్వం 84 ట్రాఫిక్‌ సూపర్‌వైజర్స్‌ ట్రైనీలు, 114 మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

KA Paul : కేఏ పాల్ క్రిస్మస్ సందేశం..వైరల్
Apple Santa : శాంటా క్లాజ్ శిల్పంతో పూరీ కళాకారుడి వరల్డ్ రికార్డ్

Latest News