Site icon vidhaatha

Jayashankar Bhupalapalli | మేడిగడ్డ వద్ద జోరు తగ్గని గోదావరి

విధాత, హైదరాబాద్ 😐 జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌ మండల పరిధిలోని అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత, తెలంగాణలోని గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆదివారం బరాజ్‌ ఇన్‌ఫ్లో 4,87,010 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అన్నారం బరాజ్‌కు 16,870 క్యూసెక్కుల నీరు వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌ వద్ద ఎగువనుంచి 8 లక్షల 8 వేల 340 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. దీంతో బరాజ్‌ వద్ద గోదావరి నీటిమట్టం 82 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. మొత్తం 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Exit mobile version