విధాత : ఎస్సీ గర్ల్ హాస్టల్ విద్యార్థినిని వార్డెన్ చితక బాదిన ఘటన వీడియో వైరల్ గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్ హాస్టల్ లో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని బూతులు తిడుతూ..కర్ర, చేతులతో ఇష్టారీతిన విచక్షణారహితంగా చావబాదింది. ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియో తీశారు. గత నెల 24న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండు నెలల క్రితం ఇదే ఎస్సీ హాస్టల్ లో విద్యార్థినులకు మత బోధనలు చేసిన ఘటన వివాదస్పదమైంది. విద్యార్థినిని చితకబాదిన ఘటన వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకునేందుకు మా పిల్లలను పంపిస్తే..మత బోధనలు..చితకబాదుడు ఘటనల బారిన పడటంపై వారు ఆందోళన చెందుతున్నారు. కాగా విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థినిని చితకబాదిన వార్డెన్
(Sensitive)జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘటన
కర్ర, చేతులతో ఇష్టారీతిన డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని విచక్షణారహితంగా చావబాదిన హాస్టల్ వార్డెన్ భవాని
వీడియో తీసిన తోటి విద్యార్థినులు
గత నెల 24న… pic.twitter.com/gsa3E4LrRH
— ChotaNews App (@ChotaNewsApp) December 29, 2025
ఇవి కూడా చదవండి :
Ashu Reddy | హాట్ అలర్ట్.. గ్లామర్ షోతో మతిపోగొడుతున్న ఆషు రెడ్డి
Ashu Reddy | హాట్ అలర్ట్.. గ్లామర్ షోతో మతిపోగొడుతున్న ఆషు రెడ్డి
