Site icon vidhaatha

Mallanna | ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న సంచలన నిర్ణయం..!

Mallanna : ‘వరంగల్-ఖమ్మం-నల్గొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీన్మార్‌ మల్లన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్ కుమార్ పారదర్శక రాజకీయాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇంతకూ ఆయన తీసుకున్న నిర్ణయం ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..

తీన్మార్‌ మల్లన్నకు రూ.1.50 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన తనకు ఉన్న రూ.1.50 కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నామిననేషన్ సందర్భంగా సందర్భంగా మల్లన్న భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన తన ఆస్తుల అప్పగింతపై ప్రకటన చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు తాను వెళ్లి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రభుత్వానికి అప్పగిస్తానని తెలిపారు. అంతేగాక ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు కూడా తాను జవాబుదారిగా ఉంటానని ప్రకటించారు. తాను క్లీన్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో వస్తున్నానని చెప్పారు. అందుకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.

Exit mobile version