విధాత, హైదారబాద్ : హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్లు ప్రజలకు ఉద్యోగాలిస్తామని చెప్పి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలకులు నిరుద్యోగుల పొట్ట కొట్టి..తెలంగాణను దోపిడీ చేశారన్నారు. నగరంలో అడ్డగోలు అనుమతులతో ట్రాఫిక్ సైతం అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ఢిల్లీ మాదిరి కాలుష్యం బారిన పడకుండా ముందుచూపుతో హిల్ట్ పాలసీ తెచ్చిందన్నారు. ఢిల్లీ మొత్తం కాలుష్యమై పోయి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అందరం చూస్తున్నామన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో కూడా రాకుండా ఉండాలని హిల్ట్ పాలసీ తెచ్చి..పరిశ్రమలను నగరం వెలుపలికి ఓఆర్ఆర్ ఆవలికి తరలించబోతుందని తెలిపారు. పచ్చ కామెర్ల వాడికి దేశమంతా పచ్చగా కనిపించినట్లుగా..పదేళ్లుగా బీఆర్ఎస్ వారు చేసిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందన్న అపోహలను సృష్టిస్తూ హిల్ట్ పాలసీపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు గత పదేళ్లలో హైదరాబాద్ ని దోచుకుంటుంటే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. ఇప్పడు హిల్ట్ పై ఎందుకు అనవసర రాద్దాంతం చేస్తున్నారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సామెత లాగా దేవుళ్ల గురించి మాట్లాడిన వ్యాఖ్యల్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కులం, మతం లేకుండా బీజేపీ వాళ్లకు పూట కూడా గడవదన్నారు. డీసీసీల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
Sama Ram Mohan Reddy : కిషన్ రెడ్డి ఒక బ్రోకర్..కిరికిరి రెడ్డి
Illegal Loan Apps : అనధికార లోన్ యాప్స్ కు కేంద్రం షాక్..87యాప్స్ పై నిషేధం
